1, జులై 2021, గురువారం

చేయండి చేయండి చిన్నినామము

చేయండి చేయండి చిన్నినామము తీయ
తీయని మన రామదేవుని నామము

చేయండి సుజనకోటి చేయునామము మీరు
చేయండి హరిని తెలియజెప్పు నామము
చేయండి కలిమాయ చెఱచునామము మీరు
చేయండి శ్రీహరిదరికి చేర్చునామము

చేయండి నిచ్చలును చిత్తశుద్ధితో మీరు
చేయండి హరిభక్తి గలిగి శ్రధ్ధతో
చేయండి రాముడు రక్షించితీరును మీరు
చేయండి చింతలన్ని చెదరిపోవును

చేయండి సామీరి చేయునట్లుగ మీరు
చేయండి శివుడెపుడు చేయునట్లుగ
చేయండి నామభజన శ్రేష్ఠకార్యము మీరు
చేయండి చేయించండి రేయింబవళ్ళు

2 కామెంట్‌లు:

  1. By virtue of having great person like you , we are all becoming better persons day by day , thank you.🙏🙏🙏

    రిప్లయితొలగించు
  2. ఒక్క రోజు లో ఇన్ని కీర్తనలు రాయటం నిజం గా ఆ దైవ కృప నే ఇది అందరికి సాధ్యం కాదు. నిజం గా ధన్యుడివి... విజయ

    రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.