12, జులై 2021, సోమవారం

నీశుభనామము చేయుటే

నీశుభనామము చేయుటే
దాశరథీ నా మతము

కామాదులను త్రోయుటే
స్వామీ చక్కని మతము
పామరత్వము వీడుటే
రామా చక్కని మతము

పామరత్వమును వీడుటకై
నామము చేయుటె విధము
ఏమరక నీనామ సుధ
ప్రేమగ గ్రోలుట నామతము

గోముగ రామహరే యనుటే
స్వామీ నావిధ మందును
నామము నీవే యందును
నామత మదియే‌ నామతము

3 కామెంట్‌లు:

 1. ഷ്രീ രാമ ജഗദാഭി ഗുണധാമ
  സീത സമേത രഘുകുല ജയ രാമ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మన్నించాలి. అంతో ఇంతో‌ తెలుగూ, తగుమాత్రంగా ఇంగ్లీషూ, బుడిబుడి సంస్కృతమూ తప్ప మరేమీ రాదు నాకు. మీ‌రేదో‌ భాషలో ఏదో అంటే ఏం చెప్పేది! google trnslate వాడు చేసిన తెలుగు అనువాదం "శ్రీ రామ జగదాభి గుణధమ సీతతో కలిసి రఘుకుల జయరామ" (ఇందులో తప్పులున్నాయి!) బహుశః "శ్రీ రామ జగదభి గుణధామ
   సీతతో కలిసి రఘుకుల జయరామ" అయ్యుంటుంది. ఐనా అంత సంతృప్తి కరంగా లేదు. పోనివ్వండి! ధన్యవాదాలు.

   తొలగించండి
  2. మన్నించాలి శ్యామల్ రావు సర్.. నేను అచ్చోట రాసింది "శ్రీరామ జగదాభి గుణధామ సీత సమేత రఘుకుల జయరామ", ఇకపై ఇటువంటి భాష ప్రయోగాలు చేసినపుడు వాటికి తెలుగు లో కూడా అనువదిస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షంతవ్యుణ్ణి. అది అనంత పద్మనాభ స్వామి వారు, మరియు అయ్యప్ప స్వామి వారు కొలువు దీరిన కేరళీయ మలయాళం. గాడ్స్ ఓన్ కంట్రి గా పేరు గాంచిన క్షేత్రమని ఈ ప్రయత్నం అటుపై సాహసం చేసితిని.

   దశరథ నందన సరయు తట స్థిత అయోధ్య పురి స్థిర నివాసాయ శ్రీరామ భద్రాయ నమామి.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.