9, జులై 2021, శుక్రవారం

మాంపాహి శ్రీరామ మహనీయమూర్తీ


మాంపాహి శ్రీరామ మహనీయమూర్తీ
మాంపాహి శ్రీకృష్ణ మంగళమూర్తీ

వందారు భక్తజన మందార రఘురామ ఇందీవరశ్యామ మాంపాహి
కందర్పశతకోటిసుందరా సానంద నందనందన కృష్ణ మాంపాహి

సురవైరిగణనాథకులనాశకా లోకశోకాంతకా రామ మాంపాహి
కురుకులకమలవనదావానలా కృష్ణ గోవింద మాధవ మాంపాహి

భక్తజనపోషకా పరమపురుషా రామ ముక్తిప్రదాయక మాంపాహి
భక్తజనపోషకా పరమపురుషా కృష్ణ ముక్తిప్రదాయక మాంపాహికామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.