23, జులై 2021, శుక్రవారం

హరియే సర్వం బని తెలియవయా హరిసాన్నిధ్యం బబ్బునయా

హరియే సర్వం బని తెలియవయా  
హరిసాన్నిధ్యం బబ్బునయా

హరినామము నీ వెప్పుడు చేసిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరికథలను నీ వెప్పుడు చదివిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరి నీ తలపున కెప్పుడు వచ్చిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరి సన్నిథి నీ వెప్పుడు నిలచిన ఆనందము నీ కప్పుడు కలుగును
 
హరిపారమ్యుము నెఱిగితివా నీ‌ కభయము నిత్యము కలుగుచు నుండును
హరి రామాకృతి కొలిచెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
హరిని కృష్ణుడని కొలిచెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
హరేరామ యని పలికెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
 
హరిభక్తులతో మెలగెదవా నీ కనిశము శుభములు కలుగుచు నుండును
హరిభక్తుడవై నిలిచితివా నీ‌ కనిశము శుభములు కలుగుచు నుండును
హరినే కడు ప్రేమించెదవా నీ కనిశము శుభములు కలుగుచు నుండును 
హరి నీవాడని నమ్మితివా నీ కనిశము శుభములు కలుగుచు నుండును
 
 

1 కామెంట్‌:

  1. ఈ కీర్తనలు చదువుతున్నపుడే మాకు నిజమైన ఆనందం, ఈ కీర్తనలు ద్వారా మాకు హరినామ స్మరణ చేయిస్తునందుకు ధన్యవాదములు 🙏

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.