ఓ రామా నమ్మిన వాడనే
శ్రీరామా నమ్మిన వాడనే
రామరామ హిమధామసమానన
నామనోహర నారాయణ హరి
అరమరలేదని పరిపరి విధముల
శరణంటిని యక్కర చూడవు గదె
సుచరితసేవకనిచయాస్పద స
ద్వచననిరంతర ఖఛరాదినుత
సారహీనవికారదుష్టసం
సారసాగరము భారమాయె గదె
నీయెడ నేమి యుపాయము దోచదు
కాయము నీదని కడునమ్మితి గదె
చలమువలదు సత్ఫల మొసగవె నిను
తలచెద పలుమరు నళినదళేక్షణ
శ్రీకర రాకమచర్ల నిలయ కరు
ణాకర నీకృప కాశించితి గదె
( రాకమచర్ల వేంకట దాసు గారి కీర్తన)
సూపర్బ్ 🙏🙏
రిప్లయితొలగించండిరాకమచర్ల వేంకటదాసు గారు పందొమ్మిదవ శతాబ్దపు వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలనూ కొన్నింటిని పరిచయం చేదామని అనుకుంటున్నాను. అయన లక్షకీర్తనలు రచించారని ప్రతీతి కాని ఇప్పుడు ఒక ఐదువందలదాకా (అదీ తప్పులతో) మాత్రమే దొరుకుతున్నాయి.
తొలగించండి