నాతప్పు లెన్నెదవు నారాయణా నేను
నీతప్పులెన్నెదను నీసెలవైన
కావు మీశ్వర యని కరిరాజు మొత్తుకొన
నేవేళ కరుదెంచినావో ఏనుగిక
చావబోయెడు వేళ చటుకున నూడిబడి
నీవద్భుతము జేసి నావయ్య బళిబళి
కురుసభను మానిని గొల్లుమనుచు నుండ
మరి యెందు దాగుండి నావో మానినికి
మరియాద చెడుచుండ మరియంతలోనె
పరిరక్షణము చేయ వచ్చితివి బళిబళి
ఏమి చేసెను మున్నింతిని సొదబెట్టి
కామారిప్రభృతులు రాముడా యిదియేమి
యే మన్న నాపైన నింపార గొంటివి
స్వామి నీ చెయుద మీ చాడ్పాయె బళిబళి
"మీ వల్ల గుణదోషమేమి ఓ రామ నా వల్ల నే గాని" అనే త్యాగరాజకీర్తన కు వ్యతిరేకార్థంతోనున్నా, ప్రతి పాదం చివరలో బళి బళి అని మళ్ళీ రామచంద్రుణ్ణే పొగడుతున్నారు! నిందాస్తుతి అంటే ఇదేనేమో!
రిప్లయితొలగించండి