మధ్యాక్కఱ.
పరమసుందరరూప నిన్ను పొడగాంచ ప్రభవించె గాక
మరియేల కలిగె నీరెండు కన్నులు మహనీయ మూర్తి
సరిసరి వీని బెట్టుకొని శ్రీరామచంద్ర పామరుల
నరయుచు తృప్తిచెందెదనె చెప్పవయా పరమాత్మ
ఓ రామచంద్రప్రభూ.
నువ్వు పరమసుందరుడివి.
నిన్ను చూడటం కోసమే ఈశరీరంలో రెండు కళ్ళు పుట్టాయి.
కాకపోతే ఇవెందుకున్నట్లు?
ఇలా ఒక గొప్పప్రయోజనం కోసం ప్రభవించిన నేత్రద్వయాన్ని పెట్టుకొని నిన్ను చూస్తానే కాని సరిసరి పామరులను చూస్తూ తృప్తిపడతానా ఏమిటి?
పరమాత్మా, నువ్వే చెప్పు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.