ఆటల భరతుడు నీతోకలియక అల్లరి చేసేనా లక్ష్మణ
తోటలలోన చెట్లెక్కి దుడుకాటలు వద్దనెనా రాముడు
కోటదాటి పోరాదని నిన్నే కోపగించినారా భటులు
మాట వినని నీయల్లరి చూసి మందలించినారా అమ్మలు
కోపము కొంచెము తగ్గించుమని గురువులు నిన్ననిరా లక్ష్మణ
చాపము నపుడే చేతికీయమని కోపము చేసినదా సుమిత్ర
లోపరహితుడగు రాముని యందే లోపమెంచినారా సఖులు
తాపసివేషము వేసియాడుటను తప్పుబట్టినారా తరుణులు
మురియుచు నిన్ను మంత్రి సుమంతులు ముద్దుచేయలేదా నేడు
పరులెవరైనా మీసోదరులను పరిహసించినారా తండ్రీ
నరపతియై నీతండ్రియుండగా నాన్నా వగపేలా నీకిక
ధరపై నీకును నీయన్నకును తిరుగులేదు పోరా లక్ష్మణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.