4, మే 2023, గురువారం

పలుకవేల రామా


పలుకవేల రామా నిన్నే
కొలుచువాడ గానా

తలచితలచి నిన్ను పులకరించి నేను
పలుకరించి నపుడు బ్రహ్మాండనాయక
ఉలకక పలుకక నూరకుండుట తగదు
కలిమలవిధ్వంసకారణశుభనామ

పలుకరింతువు నీవె తొలుతగ నని వింటి
పలుకుపలుకున తేనె లొలుక పలుకుదు వట
పలుకరించి నిన్ను భంగపడుటయె గాని
సలిలితముగ నొక్క పలుకైన పలుకవే

కలనైన నీపేరు కలువరించెడు వాడ
నళినదళాయతాక్ష నానేర మేమిటయ్య
పలుకవయ్య నాకు భవమింక లేదనుచు
జలజాప్తకులతిలక పలుకర రామచంద్ర 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.