1, మే 2023, సోమవారం

మనకు రాముడే చాలందును

మనకు రాముడే చాలందును మీ మనసే మనునో చెప్పండి

వారిని వీరిని యూరక పొగడుట వాంఛనీయమా చెప్పండి
మారజనకుని కీర్తించుటయే మనకుచాలదా చెప్పండి
 
మానక శాస్త్రంబులను నేర్చుట మనకు ముఖ్యమా చెప్పండి
మానసమున హరిభక్తి కుదిరినది మనకు చాలదా చెప్పండి
 
మహామంత్రములపైన మోహము మనకు దేనికి చెప్పండి
మహామహిమగల రామనామమే మనకుచాలదా చెప్పండి

మహిమల కొరకై వెంపరలాటలు మనకు దేనికి చెప్పండి
మహిలో రాముని భక్తులమగుటే మనకుచాలదా చెప్పండి
 
సంసారమునకు నిత్యము భయపడి చచ్చుట దేనికి చెప్పండి
కంసవిదారికి శరణము జొచ్చిన కలగదు జన్మము కదటండి
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.