3, మే 2023, బుధవారం

సారెకు పుట్టనేలరా సాకేతరామ

సారెకు పుట్టనేలరా సాకేతరామ 
సారెకు చావనేలరా
 
ధనధాన్యముల కేడ్చు మనుషుల కేగాని
వనితలపై బుధ్ధి పామరులకె కాని
మనసున హరినుంచి మసలుచుండెడు వారు
వనజాక్షుని కరుణ వలన మరల నింక
 
నారాయణా నిన్ను నమ్మిన జీవులకు
తారకనామ ముండ దశరథరామ ఇక
ధారుణి నాజీవులు తప్పక వైకుంఠ
పౌరులగుదురు గాక వారెవ్వరికి నిక

రామా యనగ పాపరాశి బూదియగును
రామా యనగ చెప్పరాని సుఖము గలుగు
రామా యనగ హరియె రమ్మని పిలుచును
భూమిని యట్టి జీవి పొందుచు మోక్షము