విశేషవృత్తాలు

పాహిరామప్రభో శీర్షికలో వ్రాసిన విశేషవృత్తాలకు సూచిక. పాఠకుల సౌకర్యార్థం, ఈ సూచిలో వృత్తాలను నిఘంటుక్రమంలో అమర్చుతున్నాను. వృత్తం పేరుతో‌బాటుగా దానికి చెందిన త్రికగణవిభజన కూడా చూపుతున్నాను.

ఈ వృత్తాలలో కొన్ని నేను సృజించుకొన్నవి కూడా ఉన్నాయని గమనించగలరు.

 1. అజితప్రతాపము (సజసస+నభజర)
 2. అర్థకళ (ససస) 
 3. అలసగతి (నసనభయ)
 4. అంబుజము (భవ)
 5. అంబురుహము (భభభభరసవ)
 6. ఇంద్రవంశం (తతజర)
 7. ఉత్సుకము (భభర)
 8. కుమారలలిత (జసగ)
 9. కుమారవిలసిత (జనగ)
 10. కృష్ణగతిక (భజగగ)
 11. కౌముది (నతతగ)
 12. ఖటకము (జజజవ)
 13. గజగతి(జజజవ)
 14. చిత్రపదం (భభగగ)
 15. చంద్రవదన (భయ)
 16. చంద్రవర్త్మ (రనభస)
 17. చంద్రిక (నననవ)
 18. జలదము (భరనభగ)
 19. జలోధ్ధతము (జసజస)
 20. తనుమధ్య (తయ)
 21. తరళము (నభరసజజగ)
 22. తోటకము (సససస) 
 23. త్వరితగతి (నననననననగగ)
 24. ద్రుతవిలంబితం (నభభర)
 25. నర్కుటము (నజభజజవ)
 26. నవమాలిని (నజభయ)
 27. నారాచకము (తరవ)
 28. నందిని (భతజగ)
 29. పదమాలి (నజజర)
 30. ప్రముదితవదన (ననరర)
 31. పాదపము (భభభగగ)
 32. ప్రగుణము (సగగ)
 33. ప్రణవము (మనయగ)
 34. ప్రమాణి (జరలగ)
 35. ప్రమితాక్షరము (సజసస)
 36. ప్రియ (సవ)
 37. ప్రియంవద (నభజర)
 38. పంక్తి (భభభగ)
 39. బింబము (భగ)
 40. భద్రకము (రనర)
 41. భీమార్జునము  (తరగ)
 42. భుజగశిశుభృతము (ననమ)
 43. భుజంగప్రయాతము (యయయయ)
 44. భోగవిలసిత (భసజగ)
 45. మదనకము (ననస)
 46. మనోరమ (నరజగ)
 47. మయూరసారి (రజరగ)
 48. మాణవకం (భతలగ)
 49. మానిని (భభభభభభభగ)
 50. మణిమధ్యము (భమస)
 51. మణిరంగము (రససగ)
 52. మాలిని (ననమయయ)
 53. మంగళమహాశ్రీ (భజసనభజసనగగ)
 54. మదనవిలసితము (ననగ)
 55. మదరేఖ (మసగ)
 56. మధుమతి (నభగ)
 57. మత్త (మభసగ)
 58. ముకుళితకళికావళి (రననర)
 59. మంజులయాన (సనభజర)
 60. రథోధ్ధతము (రనరలగ)
 61. రామభోగి (రభర)
 62. రుక్మవతి (భమసగ)
 63. లయగ్రాహి (భజసనభజసనభయ)
 64. లలిత (తభజర)
 65. వసుధ (సస)
 66. వసుమతి (తస)
 67. వంశస్థము (జతజర)
 68. విద్యున్మాల (మమగగ)
 69. వినయము (స)
 70. విభూతి (రజగ)
 71. విమానం (జతగగ)
 72. విశాలాంతికం (తతతగ)
 73. శిఖరిణి (యమనసభవ)
 74. శుధ్ధధార (రజతరవ)
 75. శుధ్ధవిరాటి (మసజగ)
 76. శ్రీ (గ)
 77. శ్రీపెంపు / స్త్రీ (గగ)
 78. సుకాంతి (జగ)
 79. సుమంగళి(సజససగ)
 80. సింహగతి (రనగగ)
 81. సింహరేఖ (రజగగ)
 82. సుందరి (భగగ)
 83. స్రగ్విణి (రరరర)
 84. సుకేసర (నజభజర)
 85. స్వాగతం (రనభగగ)
 86. హలముఖి (రనస)
 87. హంసమాలి (సరగ)

6 వ్యాఖ్యలు:

 1. శ్రీ శ్యామలీయం గారూ, విశేష వృత్త సంఘటిత రామ ప్రశంసేతివృత్తంగా ' విశేష ప్రయత్నం ' చేస్తున్నారు . అభినందనీయం. ముక్తకములుగా కాకుండా దాదాపు 200- 300 విశేష వృత్తాలలో ' సంపూర్ణ రామ కథ ' నే అనుకుంటాను (వస్తువు ఇదమిత్థంగా గుర్తు రావడం లేదు ) - శ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారని గుంతకల్లు వాస్తవ్యులొకరు - ఆంధ్రోపాధ్యాయులుగా పదవిని విరమించినవారు - ఒకదాన్ని ఈమధ్యనే , ఒక 2-3 సంవత్సరాల క్రితం - గ్రథించినారు.అప్పటికది నాన్యతో దర్శనీయం. మళ్లీ ఆ తరువాత ఈ ప్రయత్నం మీ దగ్గరే చూస్తూన్నాను. మత్కృత ధర్మదండ , భామినీ విలాసాంధ్రీకరణములలో తరళ స్వాగత శిఖరిణీ తోటక మందాక్రాంత మంగళ మహాశ్రీత్యాదులను అటనట ప్రయోగించినాడ కానీ మీ ఇరువురి వలె ఇంతటి బృహత్ప్రయత్నం కాదు.ఇప్పుడే స్థాలీపులాక న్యాయంగా భవద్గ్రథిత "మంజులయాన" సందర్శనం తటస్థించినది. సలక్షణం కనుక పండితామోదం లభించక మానదు. వీలు వెంబడి చదవవలసిన ' సరుకు ' చాలానే ఉన్నదిందులో అన్న సూచన చేసిన పద్యమిది కనుక అభినందనలు. ( రెండవ పాదంలో కనుగొందును+అను+ఆశ అన్న చోట సంధిగత ప్రమాదాన్ని తప్పించడం కోసం కనుగొందునను కోర్కె ... కానీ , మరేదైన నిర్దుష్ట పద నిక్షేపం కానీ చేస్తే సరిపోతుందని సూచన. ) పునర్దర్శనాభిలాషి - భవదీయుడు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ధన్యవాదాలు విష్ణునందనులవారూ,
  వివిధ ఛందస్సులలో క్లుప్తంగా రామకథా గానం చేస్తున్న టపాలు కొన్ని ఈ శీర్షికలో ఉన్నాయి. ఇంకా ఆ ఒరవడిలో మరికొన్ని వీలువెంబడి వస్తాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీ, శ్రీపెంపు వృత్తాలు రేపు 31 ఉదయం పబ్లిష్ అవుతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అమ్మయ్య! ఇందాకా మీరిచ్చిన లింక్ లో లిస్ట్ కనపడలేదు. ఇప్పుడు భయం లేదు :) చూసుకోండింక మీదే ఆలస్యం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏమయితేనేమి మొత్తానికి బ్లాగుల నుంచి నిష్క్రమించి సుఖపడిపోయారు, నా వంతుకోసం చూస్తున్నా! త్వరలోనే .......

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నిష్క్రమించటం నిజంగా మంచి పని ఐతే కావచ్చుననే అంగీకరింక తప్పదండి. పరిస్థితులు అలా ఉన్నాయి. నాకైతే ఉద్యోగబాధ్యతలతో ఊపిరిసలపటం లేదు. బ్లాగులకేసి దృష్టిసారించేందుకు సమయం దుర్లభంగా ఉన్నదండి. మనస్సులో రామనామం చక్కగా నడుస్తూనే ఉంటుందండి. ఏదైనా వ్రాయాలన్నా చదవాలన్నా ఒక ఐదునుముషాలు సంపాదించుకోవటం గగగనంగా ఉన్నది. క్షమించాలి. త్వరలోనే మళ్ళా రామాంకితంగా చేతనైనంతగా వ్రాయగలననే ఆశిస్తున్నాను.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.