ఎరుక గలిగితే యెల్లతావులను
హరి పరమాత్ముడు ప్రత్యక్షం
చరాచరంబుల నెల్ల వేళలను
సర్వాత్ముడు హరి ప్రత్యక్షం
హరి పరమాత్ముడు ప్రత్యక్షం
చరాచరంబుల నెల్ల వేళలను
సర్వాత్ముడు హరి ప్రత్యక్షం
దేహధారులను పాత్రలతో హరి
దివ్య నాటకము సృష్టి యని
మోహము చెందక పాత్రను నిలచుట
బుద్ధిమంతుల కొప్పునని
హరేరామ యని హరేకృష్ణ యని
ఆనందముతో పలుకగను
హరికన్యంబగు నదియే లేదని
అంతరంగమున చక్కగను
మరపు లేక హరినామము పొందే
మనసును నిలుపుట కార్యమని
హరినామంబును హరియును నొకటే
యనుచు చక్కగా హృదయమున
శ్యామలీయం గారు, నమస్తే. తెలుగు పదాలకు మొదట యకారం ఉండదు కదా, ఎరుక అనే మొదలు పెట్టండి. ఎల్ల వేళలను లేదా ఎల్ల వేళలా } "ఎల్ల వేళ్లను" అనేది ప్రమాద పతితం కావచ్చుననుకుంటున్నాను.
రిప్లయితొలగించండియెరుక అని వాడటం తెలిసి పరాకున చేసిన పొరపాటు.
తొలగించండిఎల్ల వేళ్లను అన్నది ప్రమాదవశాత్తు అనగా typo అండి.
నేను తరచుగానే మొబైల్ మీదనే వ్రాసి ప్రచురించటం కూడా జరుగుతూ ఉంటుందండీ - అప్పుడు బాగా typos పడిపోతున్నాయండి. (మాశ్రీమతి డయాలసిస్ పేషంట్ కాబట్టి డయాలసిస్ హాలు బయట నేను వేచి ఉన్న సమయాల్లో అలా మొబైల్ మీద వ్రాస్తూ ఉంటానండి)