రామ రామ యని వినబడగానే రాకాసులు పరుగెత్తేరు
రామదాసులు కనబడగానే రాకాసులు పడిపోయేరు
రామా యని యెవరెవరిని పిలిచిన రాకాసులు వెరగందేరు
రాముని బాణము గురితప్పదని రాకాసులు పరుగెత్తేరు
రాముని గుడి గల యూరుల వంకకు రాకాసులు రాకుండేరు
రాముని నమ్మెడు మనుజుల జోలికి రాకాసులు రాకుండేరు
రాముని బంటుల బంటుల జోలికి రాకాసులు రాకుండేరు
రాముని రాజ్యపు పొలిమేరలకు రాకాసులు రాకుండేరు
శ్యామలీయం గారు, నమస్తే. మీ బ్లాగు సందర్శించడానికి పంపినందులకు ధన్యవాదాలు. ఎప్పటివో,ఎన్నో పాతా,కొత్తా విశేషాలున్నవిచట నేను చూడనివి. అక్కడక్కడ చూస్తూ దీని వద్ద ఆగి, చాలా కాలం తర్వాత ఇప్పటికి ఇది తొలి వ్యాఖ్య. దీనికి ఇందులో ఉన్న తూగు ఒక కారణం. వ్యాకరణ రీత్యా "రాముని గుడి కల యూరుల" దగ్గర కళ్లు, మనస్సు ఆగిపోవడం ఇంకొక కారణం. ప్రథమ మీది పరుషములకు గసడదవలగు- చేత రాముని గుడి గల యూరుల" అని నిరభ్యంతరంగా అనవచ్చు. గుడిన్ + కల మాత్రమే "గుడిఁ గల" అవుతుందనే సందేహంతో (సరళాదేశం) మీరు ఆగినారేమో అనిపిస్తోంది కానీ, చాలా మట్టుకు సందర్భాలలో పై గసడదవాదేశం అరసున్న లేకుండా కూడా పరుషాలను కొట్టివేస్తుంది. అయోధ్యా రాముని గుడి ఇంక ఎంత మాత్రమూ "కల" కాదన్న వ్యంగ్యోక్తి కూడా ఇందులో ఇమిడి ఉంది. :-).
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ. నాసందేహాన్ని గమనించారు. మీరు నివృత్తి చేసారు కనుక గుడి గల అని మార్చానండీ.
తొలగించండి