29, జనవరి 2018, సోమవారం

ఎవడయ్యా రామునిబంటు యిక్కడ మీలో


ఎవడయ్యా రామునిబంటు - ఇక్కడ మీలో
ఎవడుకాడు రామునిబంటు - ఇక్కడ మాలో

అతులిత బలధాముడయ్యు నణకువ తోడ
అతని పాదాల భక్తి నంటియుండు నంట
అతివ సీతమ్మ జాడ లరసి వచ్చెనంట
అతడైతే ఆంజనేయు డల్లదిగో వాడే

హరి త్రివిక్రముం డైన నమితభక్తి ముమ్మారు
తిరిగె నాతని చుట్టు దివ్యప్రభావు డిపుడు
నరరూపధారి హరిని నమ్మి కొలుచు నంట
సరిసరి యా పెద్దవాడు జాంబవంతు డడుగో

సభలోన నీతులు పలికి చావు దప్పి వచ్చి
అభయమడిగి లంకారాజ్యవిభవము పొంది
ఉభయలబ్ధి చేకొన్న యుత్తము డ వ్వాడంట
విభీషణుడు మహితధర్మ వీరుడు వాడే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.