14, జనవరి 2018, ఆదివారం

కరుణించుమా రామ పరమేశ్వరా


నరజన్మ మెత్తితి పరమేశ్వరా నన్ను
కరుణించుమా రామ పరమేశ్వరా

ఒరుల మెప్పులు కోరి పరమేశ్వరా చాల
తిరుగాడి చెడితిని పరమేశ్వరా
నరులు మెచ్చగ నేల పరమేశ్వరా నీవు
సరి యన్నదే చాలు పరమేశ్వరా

పరిపాటిగా బుధ్ధి పరమేశ్వరా చాల
పొరపాటులే చేసె పరమేశ్వరా
పరితాపమును పొంది పరమేశ్వరా నిన్ను
శరణు కోరిన దయ్య పరమేశ్వరా

వరమేమి వలదయ్య పరమేశ్వరా నీదు
కరుణామృతము చాలు పరమేశ్వరా
తరియించి భవమింక పరమేశ్వరా నిన్ను
పరమాప్త కలిసెదను పరమేశ్వరా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.