14, జనవరి 2018, ఆదివారం

రాముని పొగడితే రమణి సీతమ్మ మెచ్చు


రాముని పొగడితే రమణి సీతమ్మ మెచ్చు
భూమిజ మెచ్చెనా పొంగు రాముడు

ఏమి భేషజము లేక రామాయణము చదివి
ప్రేమమూర్తులగు సీతారాముల గూర్చి
మీ మనసువిప్పి పలుక రేమి చిత్రమే యిది
యేమి యా బ్రహ్మశివుల కధికులె మీరు

నాడు నేడు నరజాతిని నడిపించు నట్టిచరిత
చూడ రామాయణంబు సుదతి సీతమ్మ చరిత
ఏడేడులోకంబుల నేలు మన తల్లి చరిత
పీడలు పోగొట్టు ధర్మవీరుడు రాముని చరిత

నడువరే మంచిదారి నారాయణ రూపుని
తడబడక శ్రీరాముని ధర్మస్వరూపుని
నుడువరే మీవాక్కుల నోరునొవ్వ నిరతమును
కడుంగడు మెచ్చు తల్లి కరుణించు రాముడును


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.