15, జనవరి 2018, సోమవారం

గజగతిలో రామస్తుతి.






       గజగతి.
       ఇనకులోత్తమ సదా
       వినుతిసేసెద నినే
       ననుకృపార్హుడనుగా
       గనుము కోసలవిభో




గజగతి.

ఈ వృత్తానికి గణాలు న-భ-లగ అంటే గురులఘుక్రమం III UII IU పద్యపాదానికి కేవలం 8 అక్షరాలు  మాత్రమే కాబట్టి యతిమైత్రి స్థానం అంటూ ఏదీ ఉండదు. కానీ వృత్తం అన్నాక ప్రాసనియమం మాత్రం పాటించాలి.

 ఈవృత్తం నడకను చూస్తే గురులగుక్రమాన్ని మూడక్షరాల గణాల పధ్ధతిలో కాక IIIU IIIU  (నగ - నగ) అన్నట్లు  చూడాలి. అప్పుడిది పాదం మధ్యలోనికి సౌష్ఠవంగా విరగటం గమనిస్తాము. ఈ సౌష్ఠవం ఉందన్న దృష్టికలిగి వ్రాసినప్పుడు పద్యం మరింత అందంగా వస్తుంది.

ఈపద్యంలో కొన్ని చమత్కారాలకు వీలుంది. మొదటిది 5వ అక్షరం మీద యతిని పాటించటం. అదొక సొగసైతే ప్రాసయతిని వేసి వ్రాయటం మరింత సొగసుగా ఉంటుంది. అసక్తి కలవారు ప్రయత్నించండి. 

పద్యంలో ఉన్న స్థలం చిన్నది కాబట్టి ఇట్టిపొట్టి భావాల్ని అందంగా పలికించటం వరకూ ఇది బాగా ఉపకరిస్తుంది.


5 కామెంట్‌లు:

  1. నాకు మీ గజగతి నచ్చి కొంచెం ప్రయత్నించానండి - తప్పో- మన్నించండి, ఒప్పో - మార్కులేయండి:)

    కొలిచి నే మరి నిన్నే
    తలచి వేడెద విభో
    నిలిపి నీ పదములే
    కలలలో కనులలో

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.