13, జనవరి 2018, శనివారం

కోనేటిరాయడా కోదండరాముడా


కోనేటిరాయడా కోదండరాముడా
నానోట నెల్లపుడు  నీనామ ముండురా

సారెకు నీకథలు చదువకుండ లేనురా
నోరునొవ్వ నీకీర్తి నుడువకుండ లేనురా
భూరికృపారాశి నిను పొగడకుండ లేనురా
శ్రీరామభక్తులను  చేరకుండ లేనురా

మదినిండియుంటివి మరచుమాట లేదురా
నిదురనైన నీభజన వదలియుండలేనురా
అదియిది యిమ్మని  యడుగువాడ గానురా
విదితముగ నీదివ్య పదములకడ నుందురా

కరుణజూడవయ్య రామ కళ్యాణగుణధామ
ధరాసుతాయుక్త రామ దశరథాత్మజారామ
పరమమధురనామ రామ పాహికోదండరామ
నిరుపమవరదాయి రామ నిన్నునమ్మియుంటిరా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.