14, జనవరి 2018, ఆదివారం

జయపెట్టరే రామచంద్రమూర్తికి


జయపెట్టరే రామచంద్రమూర్తికి
భయవిదారునకు సర్వాత్మనా జనులార

కామపిశాచి రావణుని గర్వము పోనణచి
భూమిసుతాశోక ముడిపి భూరియశము గొన్న
ప్రేమమూర్తి శ్రీరామ విభునకు జయపెట్టరే
శ్రీమహావిష్ణు వితడె చెలగి జయపెట్టరే

నరులార ధర్మమెరిగి నడచుటనగ నిట్లని
ధరమీద చాటినట్టి ధర్మావతారునకు
పరమేశ్వర వినుతునకు బాగుగ జయపెట్టరే
హరి యితడే యన్న దెరిగి యందరు జయపెట్టరే

సకలజీవులకు నితడె సర్వేశుడని తెలిసి
అకళంకబుధ్ధులై యానంద ముప్పొంగ
ప్రకటించి శరణమని రయమున జయపెట్టరే
యిక మీకు మోక్ష మని యెరిగి జయపెట్టరే


3 వ్యాఖ్యలు:

 1. కౌసల్యాసుతుని మురిపెముతో జయపెట్టరే
  దశరథనందను గారవించి జయపెట్టరే!

  మకరసంక్రాంతి శుభకామనలు మీకు, మీకుటుంబానికి!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. హెచ్చరికగా రార శ్రీరామచంద్రా...
  హెచ్చరికగా రార హే సుగుణసాంద్రా..

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.