26, అక్టోబర్ 2019, శనివారం
ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
ఎందుకింత నిరాదరణ యినకులతిలకా
యెందుకిలా మరలసొమ్ము కింతగ కటకట
చేయకయే దుర్వ్యయము చెల్లిపోయె సొమ్మంతయు
వేయనెట్టి పందెములు వెచ్చమాయె నంతయును
ఆయమేమొ సున్నాయెను అరయ రేపేమగునో
నీ యాశయ మిపుడు నన్ను నిర్ధనుని చేయుటయా
బందిపోట్ల వలె కర్చులు పట్టినన్ను దోచగా
అందగాడ రామచంద్ర ఆనంద మేమి నీకు
తొందరించ చీకాకులు ముందటివలె పాడలే
కుందునేమొ పరీక్షించు నూహ నీకు కలిగెనా
ఎన్ని జన్మముల నుండి యిట్లు పాడుచుంటినో
యెన్నెన్ని కష్టంబుల కేరీతి నోర్చితినో
యెన్నటికిని మాననురా యీశ్వర నీ కీర్తనము
చిన్న పెద్ద కష్టములా చిత్తము నీ ప్రసాదము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ధార్మికులు, జాగ్రత్తపరులు. ఏమి ఇబ్బంది గురువుగారూ
రిప్లయితొలగించండిచెప్పుకున్నాను కదండీ, పరీక్షాకాలం నడుస్తున్నది. అంతా రామలీలావినోదం!
తొలగించండిరామా ! నిను నమ్మినవా
రిప్లయితొలగించండిరేమిర ? కష్టాల బడగ నిష్టంబా , నీ
కామోదమ ? సీతాది మ
హా మహులును రామదాసులయ్యును వినమా ?
అంతా సర్ధుకుంటుంది లెండి, శ్యామలరావు గారూ.
రిప్లయితొలగించండి"రామా నీ వాడ సుమీ, ఇక నన్ను బాముల బెట్టకుమీ" అని తూము నరసింహ దాసు గారంతటి వాడు కూడా ఇలాగే కీర్తన వ్రాశాడు, మీకు తెలియనిదేముంది.
రాజారావు గారూ, నరసింహారావు గారూ, మీ పలుకరింపుకు ఆశ్వాసనమునకు ధన్యవాదాలు. అలాగే మెయిల్ ద్వారా పలుకరించిన నీహారిక గారికీ నా ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ కీర్తనలో మనవి చేసుకున్నట్లుగా ఇదంతా పరీక్షించు నూహతో రాముడు చేస్తున్న తమాషా. అంతే.
వెత గల్గితె తాళుకొమ్మనెనే.
రిప్లయితొలగించండిఅవునండి.
తొలగించండి