ఎప్పటి వలె సంకీర్తన మింపుగా చేయరే
చప్పున మన రాముడు తప్పక కరుణించును
అడుగకనే కరుణించి యహల్య నుధ్ధరించె
పడిమూలుగు జటాయు పక్షి నుధ్ధరించె
అడిగినంతెనే పూని హరివిభు నుధ్ధరించె
అడిగో విభీషణుం డతని నుధ్ధరించె
కడు కృపతో భరతునకు కరుణించె పాదుకలు
ఉడుతపైన కృపజూపి విడచె గోటి ముద్రలు
కడు దుష్టుని కాకాసురు విడచెను కరుణించి
బడలినట్టి పౌలస్త్యుని విడచెను పడగొట్టక
కడు వేడుక నుధ్ధరించె కామినీ జాతిని
పడగొట్టి రావణుని ప్రభువు శ్రీరాముడు
అడిగిన భక్తుకోటి కపవర్గము కరుణించు
విడువకుండ కీర్తించ గడగుడు సుజనులార
20, డిసెంబర్ 2022, మంగళవారం
ఎప్పటి వలె సంకీర్తన మింపుగా చేయరే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.