21, డిసెంబర్ 2022, బుధవారం

హరేరామ నను కావవయా అదృష్టవంతుని జేయవయా

హరేరామ నను కావవయా అదృష్టవంతుని జేయవయా

హరి నీకీర్తన లాలకించుటకు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నిను చక్కగ కీర్తన చేసెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీపై సద్భక్తిని పొందెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీభక్తుల సంగతి నుండెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి యనునిత్యము నిను పూజించెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నిను స్వప్నము నందైనను గను నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీలీలలు మననము చేసెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరేరామ యను హరేకృష్ణ యను నదృష్ట మెందరి కబ్బునయా
హరే నృసింహ భక్తవరద యను నదృష్ట మెందరి కబ్బునయా
హరే పరాత్పర భవతారక యను నదృష్ట మెందరి కబ్బునయా
హరే కేశవ మధుసూదన యను నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీనామము జిహ్వను నిలచెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీతత్త్వము చింతన చేసెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీక్షేత్రము లందు వసించెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీమార్గము దప్పక నిలచెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నిను విశ్వమయుడవని యెఱిగెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి యీ యరిషడ్వర్గము లంటని యదృష్ట మెందరి కబ్బునయా
హరి యీ తాపత్రయమును విడచెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీ కన్యము దలపక బ్రతికెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీ సేవలలో తరియించెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీ పరివారములో నొకడగు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నిను తనలో కనుగొన గలిగెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నిను దలచుచు దేహము వదలెడు నదృష్ట మెందరి కబ్బునయా
హరి నీసాన్నిధ్యమునకు చేరెడు నదృష్ట మెందరి కబ్బునయా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.