22, డిసెంబర్ 2022, గురువారం

దండాలు లచ్చుమయ్య

దండాలు లచ్చుమయ్య దండాలనరే మా

కండగా నీవెప్పుడు నుండాలనరే


నీగుణమును నీశీలము నీచరితము నెంచెదము

యోగిరాజువను బిరుదం బుచితము నీకు


రావణుని సోదరి ధూర్తత్వమునకు కోపగించి

నీవు దాని ముక్కు చెక్కినావు కదయ్యా


ముక్కుమీద కోపము నీకుండు నటయ్యా ఆ

రక్కసులను బట్టి చంపు రామసోదరా


ఆ కామమోహక్రో ధాదులును రక్కసులే

మాకొఱకై ఆదుష్టుల మట్టబెట్టవే


చక్కనయ్య లచ్చుమయ్య మ్రొక్కేము నీకెపుడును

అక్కరలగు వేళల మమ్మాదుకోవయా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.