20, డిసెంబర్ 2022, మంగళవారం

మనసున మలినము లేకుండినచో

మనసున మలినము లేకుండినచో మాటయె మంత్రంబౌ నంట

గంగా గంగా గంగా యంటే గంగాస్నానఫలిత మంట

రామా రామా రామా యంటే రాముని సన్నిధి యేనంట

హరిహరి హరిహరి హరిహరి యంటే హరి నీచెంతనె కలడంట

శివశివ శివశివ శివశివ యంటే శివసాన్నిధ్యం బగునంట

అల్లరికృష్ణా రారా యంటే యంతనె యొడిలో కలడంట

ఆపద కలిగిన రామా యంటే  నాక్షణమే శుభ మగునంట

దురితవిదారా రామా యంటే దురితము లపుడే చెడునంట

భవబంధహరా రామా యంటే బంధమ లపుడే విడునంట