20, డిసెంబర్ 2022, మంగళవారం

పొగడండయ్యా హరిని పొగడండయ్యా

పొగడండయ్యా హరిని పొగడండయ్యా మీరు

పొగడదగిన వా డతడే పొగడండయ్యా


జగముల పుట్టించు వాని పొగడండయ్యా

జగముల పోషించు వాని పొగడండయ్యా

జగముల రక్షించు వాని పొగడండయ్యా

జగదీశ్వరుడైన హరిని పొగడండయ్యా


తగుననుచును మీ రితరుల పొగడకండయా

జగములు మిము జూచి నగును పొగడకండయా

భగవంతున కన్యుల నటు పొగడరాదయా

జగము మెచ్చ హరిని మీరు పొగడండయ్యా


వైకుంఠధాము డనుచు వేడ్క పొగడగ

సాకేతరాము డనుచు చక్కగ పొగడగ

లోకాభిరాము డనుచు సొంపుగ పొగడగ

మీకు శుభంబగును  హరిని మీరు పొగడరేకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.