2, డిసెంబర్ 2022, శుక్రవారం

శ్రీరామనామమే పలకండీ అది చేయు మేలును మీరు పొందండీ

శ్రీరామనామమే పలకండీ అది 
        చేయు మేలును మీరు పొందండీ

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు చేసిన పనులందు జయముండును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు చేయండి నిత్యమ్ము పనులన్నియు
        
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు పలికిన పలుకుల శుభముండును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు పలకండి నిత్యమ్ము నోరారగ
        
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు వ్రాసిన వ్రాతల బలముండును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు వ్రాయండి నిత్యమ్ము పత్రమ్ములు
        
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు మ్రింగిన మందున గుణముండును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు చేయండి నిత్య మౌషధసేవనం
        
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచున్న చిత్తమందున శాంతమే యుండును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు చేయండి నిత్యమ్ము మననమ్మును
        
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచుండు వారికా యపవర్గమే యబ్బును కాన
        శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని మీరు పలకండి నిత్యమ్ము సద్భక్తితో                                         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.