మ్రొక్కరే సీతమ్మకు ముగుదలారా హరి
ప్రక్కనమ్మకు కడు చక్కనమ్మకు
వేవురైన కదుపలేని భావజారి వింటిని
తీవవోలె నెత్తిన భూదేవిపుత్రికి
భావజగురుడైన హరి వచ్చి శ్రీరాముడై
ఆవింటి నెత్త పెండ్లి యాడిన శ్రీదేవికి
శంకింపక లంకేశుడు లంకకు గొనిపోవగ
లంకేశుని గరికపోచ లాగున నెంచి
లంకేశుని ప్రాణములను లంకేశుని బలగంబును
జంకక బలిగొనిన రామచుద్రుని సతికి
చేరి మ్రొక్కు భక్తాళికి క్షిప్రప్రసాదినయై
భూరివరములే యిచ్చు దయారసాబ్దికి
సారసలోచనుడు రామచంద్రుని యిల్లాలికి
సారసాక్షులార మనసార మ్రొక్కరే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.