రామున కన్యము తలపకుండ శ్రీరామభక్తుడు మెలగవలె
శ్రీరామనామము జిహ్వాగ్రంబున చిందులు వేయవలె
శ్రీరామచంద్రుని సేవకు రమ్మన చెంగున దుముకవలె
శ్రీరామతత్త్వము నెదలో నిత్యము చింతన చేయవలె
శ్రీరామభక్తుల సాంగత్యంబును చేయుచు నుండవలె
శ్రీరామచంద్రుని గుణగానంబును చేయుచు నుండవలె
శ్రీరామచరితము పారాయణము చేయుచు నుండవలె
శ్రీరామాంకితమై తన కృత్యంబులు చెలగుచు నుండవలె
శ్రీరామమయము జగము సర్వమని తీరుగ నెఱుగవలె
శ్రీరామచంద్రుని మోక్షము నిమ్మని కోరుచు నుండవలె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.