పలుకరించకండే నేడు చిలిపికృష్ణుని వాడు
పలుకరించినా మీరు పలుకకండే
దినదినము నిటువచ్చి తీయని మురళిపాట
వినుచున్నా మని వాడు విఱ్ఱవీగునే
కనియు కననియట్లు వినియు విననియట్లు
మనముంటే వాడే మాటవినేనే మోహనమురళి నూది మురిపించి యానంద
వాహినిలో ముంచుదాక పలుకకండే
సాహసించి మీతో సామముల నాడేనో
మోహపడక ముఖాలు ముడుచుకోండే
అదిగో వాడువచ్చు అలికిడి విన నాయే
ముదితలార నేడైన మురళిపాట
ముదమార వినుదాక మెదలకండే వాడు
సదయుడై వేణువును సవరించునే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.