23, డిసెంబర్ 2022, శుక్రవారం

నాముందే మాయలా మానవయ్య రాఘవా

నాముందే మాయలా మానవయ్య రాఘవా
కామారి వలెను నీవు కనుబడు చున్నావే

జింకతోలు శివుడు నారచీరలు ధరియించి చంద్ర
వంక నేమొ జటలలోన బాగుగ నిరికించి నన్ను
జంకింప పినాకమును చక్కగ ధరియించె ననెడు
శంగగలుగు నీదగు శివస్వరూపమును జూడ

చిరునగవును చూడగ మరి శివుడ వనిపించు హరుని
చిరునగవులు నేనెఱుగుదు చిత్రముగా నీవటులే
చిరునగవులు చిందింతువు శివుని యనుకరింతువు
హరికి దక్క యది వశమా మరి నీవే హరివా

హరి వైతే మంచిదిలే హరుని వేష మెందుకులే
నరుడవైన నీపని సరి హరివైతే నాపని సరి
మరియాదగ నీమాయను మానిరణము చేయవయా
అరావణమొ అరామమో అదినేడు తేలును

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.