20, డిసెంబర్ 2022, మంగళవారం

నీవేలే శ్రీహరివి నీవేలే రాముడవు

నీవేలే శ్రీహరివి నీవేలే రాముడవు

నీవేలే మమ్మేలే దేవాధిదేవుడవు


భూమిసుతాపతివి సర్వోత్తముడవు నీవేలే

రాముడవు భవతారకనాముడవు నీవేలే


దేవత లందరును మ్రొక్కు దేవుడవు నీవేలే

రావణుని పరిమార్చిన రాముడవు నీవేలే


దనుజకులవనము పాలి దావానల మీవేలే

వనజాసనవినుత రామభద్రమూర్తి వీవేలే


రాముడవును వైకుంఠధాముడవును నీవేలే

ప్రేమతో మమ్మేలెడు విభుడవును నీవేలే