16, డిసెంబర్ 2022, శుక్రవారం

రామా అంటే చాలురా రాని సుఖంబులు లేవురా

రామా అంటే చాలురా రాని సుఖంబులు లేవురా
 
శ్రీరఘురామా అనరా అంటే క్షేమము కలుగును కదరా
జయజయ రామా అనరా అంటే జయములు కలుగును కదరా
భయహర రామా అనరా అంటే భవభయ ముడుగును కదరా 
జగదభిరామా అనరా అంటే చక్కని యశ మబ్బునురా
జానకిరామా అనరా అంటే జన్మము సఫలము కదరా
దశరథరామా అనరా అంటే తాపము లడుగంటునురా
సుందరరామా అనరా అంటే శుభములు కలుగును కదరా
మునినుత రామా అనరా అంటే మోహము లుడుగును కదరా
హరనుత రామా అనరా అంటే పరమానందము కదరా
తారకరామా అనరా అంటే ధర నిక పుట్టవు కదరా