24, డిసెంబర్ 2022, శనివారం

నిన్ను కీర్తింతురయ్య

నిన్ను కీర్తింతురయ్య నిరతము కోదండపాణి

సన్నుతాంగ తుష్టులై సజ్జనులు పన్నుగ


కౌసల్యానందన యని కమనీయగాత్ర యని

దాసలోకపోషక యని దయారసవార్ధి యని

భాసురసత్కీర్తి యని పట్టాభిరామ యని

వాసవాదివినుత యని పరమాత్మ రామ యని


సకలలోకపాలక యని జానకీజాని యని

సకలార్ధప్రదాయక యని సత్యప్రతిజ్ఞ యని

సకలదనుజసంహర యని సమరవిహార యని

సకలయోగివినుత యని సర్వేశ్వర రామ యని


రావణనిర్మూలన యని రాజీవనయన యని

పావనశుభచరణ యని భక్తజనావన యని

భావజారివినుత యని భవరుజాంతక యని

గోవిందదేవ యని దేవదేవ హరి యని


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.