కోరరాని దాబ్రతుకు గోవిందు నెఱుంగని బ్రతుకు
ఆరాటములకు పోరాటములకె ఆయువు చెల్లెడు బ్రతుకు
వీరిని వారిని ఆశ్రయించుకొని వెళ్ళమార్చెడు బ్రతుకు
వ్యర్ధశాస్త్రముల నభ్యసించుచును వ్యర్ధముగా చను బ్రతుకు
అర్ధార్జనమున కటునిటు తిరుగుచు అటమటచెందెడు బ్రతుకు
కలసిరాని కాలమును తిట్టుచు గడపుచు నుండెడి బ్రతుకు
కలలను కార్తాంతికులను నమ్ముచు గడపుచు నుండెడి బ్రతుకు
అందరి తప్పుల నెన్నుచు తిరుగుట నానందించెడు బ్రతుకు
వందనమును వినయమును నేర్వక వాగుచు నుండెడు బ్రతుకు
శివభక్తులతో హరిభక్తులతో చేరక తిరిగెడు బ్రతుకు
పవలును రేలును కుక్షింభరతకు పట్టముగట్టిన బ్రతుకు
అవనిని సత్సాంగత్యము చేయక నన్యాంయంబగు బ్రతుకు
భవతారకమని రామనామమును భావనచేయని బ్రతుకు
శ్రీరామా రఘురామ రామ యని చింతన చేయని బ్రతుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.