19, డిసెంబర్ 2022, సోమవారం

నా బుధ్ధి కొకమాట తోచె నయ్య రామ

నా బుధ్ధి కొకమాట తోచె నయ్య రామ నమ్మ వయ్య నిజము నమ్మ వయ్య

శ్రీరామ నీ నామమే బుధ్ధిలో నాకు చింతింప సత్యమై తోచె నయ్య
శ్రీరామ నీ నామమే సత్వమై నన్ను చేరి రక్షించుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నిత్యసత్యమై చెలగుట నాకిదే తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నిత్య మనునది స్థిరముగ నాకిదే తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నాకు లోకమై  చెలగుట నిక్కమై తోచె నయ్య
శ్రీరామ నీ నామమే కవచమై నన్ను చేరి రక్షించుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే డాలుగా నేను చేనంది నిలచుట తోచె నయ్య
శ్రీరామ నీనామమే ఖడ్గముగ నేను శిక్షింతు కలినని తోచె నయ్య
శ్రీరామ నీ నామమే రక్షయై నన్ను ప్రేముడి గాచుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నాకు విజయమ్ము చేకూర్చుచుండుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నాకు తనువున జీవమై యుండుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నాకు బ్రతుకంత శ్రీకరమ్ముగ నుంట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే నాకు దివ్యమై ఆరాధ్యమై యుంట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే భవ్యమై నాకు క్షిప్రప్రసాదియై తోచె నయ్య
శ్రీరామ నీ నామమే సర్వమై నాకు సిధ్ధించి యుండుట తోచె నయ్య
శ్రీరామ నీ నామమే మోక్షప్రదమని చిన్మయ నాకిదే తోచె నయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.