22, డిసెంబర్ 2022, గురువారం

రామనామమె మేలుమేలనరే

రామనామమె మేలుమేలనరే ఈ రామనామము చాలచాలనరే


దేశదేశములందు సుజనులు దివ్యనామముగా వచించెడి

దేశకాలాతీతమై యిల తేజరిల్లుచు నిలచియుండెడి


భూమిజనులకు సర్వవేళల భూరిశుభముల నొసగుచుండెడి

భూమిజనులను సర్వవిధముల బుధ్ధిమంతుల జేయుచుండెడి


పతితపావననామమై హరిభక్తులను కాపాడుచుండెడి

అతిమనోహరనామమై సకలార్ధప్రదమై యొప్పుచుండెడి


ఈశుడే హరినామములో నెన్ని ధ్యానము చేయుచుండెడి

కాశిలో ముక్కంటి జీవుల కంత్యమం దుపదేశమిచ్చెడి