కల్లబ్రతుకు వారు చేయు కల్లపూజలు అవి
యెల్ల భంగుల జనులమోసగించనె రామ
ప్రజల మధ్యన తిరుగుచు భక్తిని నటియించుచు
ప్రజలను నమ్మించుటకై భగవంతునకు
భజనలనుచు పూజలనుచు బహిరంగప్రదర్శనములు
నిజముగ తమ పలుకుబడికి నిచ్చెన లనియే
భోగములకు మేరలేక భుధ్ధిలోన భక్తిలేక
యాగములను చేయుదురు దురాశాపరులు
యోగుల వేషములలోని భోగులు నడిపించగను
జోగిజోగి రాచుకొనెడు సొంపగు కాదే
కల్లకాని పూజలనగ ఘనులు సద్భక్తులు తమ
యుల్లమందు నమ్మి చేయు చుండునట్టివి
నల్లనయ్య అవి నీకు నచ్చునే కాని మూర్ఖు
లుల్లసించి చేయునవియు నొప్పిదంబులే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.