22, డిసెంబర్ 2022, గురువారం

రాముని దయయే సర్వస్వంబను ప్రజలకు

రాముని దయయే సర్వస్వంబను ప్రజలకు మేలగుచుండును

రాముని దయచే శాంతియు దాంతము ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే నభ్యుదయంబులు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే సర్వసుఖంబులు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే నాయుర్భాగ్యము ప్రజలకు కలుగుచు నుండును

రాముని దయచే సకలసంపదలు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే కామితార్ధములు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే నన్నిట జయములు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే నఖిలశుభంబులు ప్రజలకు కలుగుచు నుండును

రాముని దయచే విధ్యాబుధ్ధులు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే జ్ఞానవికాసము ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే ఆనందంబులు ప్రజలకు కలుగుచు నుండును
రాముని దయచే అపవర్గంబును ప్రజలకు కలుగుచు నుండును

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.