3, డిసెంబర్ 2022, శనివారం

నియమముగా శ్రీరామనామమును

నియమముగా శ్రీరామనామమును నీవు చేసిన చాలును
జయములు నీకు కలుగును భవభయము చక్కగా తొలగును

రామా జయజయ పట్టాభిరామా రామా సీతారామా యనుచు
రామా రాజలలామా సీతారామా జగదభిరామా యనుచు
రామా సద్గుణధామా సీతారామా పూర్ణకామా యనుచు
రామా భండనభీమా సీతారామా దనుజవి‌రామా యనుచు

రామా సర్వమునీంద్రసన్నుతనామా సీతారామా యనుచు
రామా శశిధరబ్రహ్మసన్నుతనామా సీతారామా యనుచు
రామా రవికులక్షీరజలనిధిసోమా సీతారామా యనుచు
రామా త్రిభువనసన్నుతనామా రామా సీతారామా యనుచు

రామా కౌసల్యాసుఖవర్ధన శ్రీమద్దశరథనందన యనుచు
రామా మునిమఖరక్షణనిపుణా రామా రాజీవానన యనుచు
రామా సీతాలక్ష్మణసంయుత రామా రావణసంహర యనుచు
రామా భక్తజనేప్సితవరదా రామా వైకుంఠధామా యనుచు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.