12, డిసెంబర్ 2022, సోమవారం

సిగ్గుపడక శ్రీరామరామ యనండీ మీకు లగ్గగునండీ

సిగ్గుపడక శ్రీరామరామ యనండీ మీకు 
లగ్గగునండీ చాల లగ్గగునండీ
 
స్వామిదయ కలుగునండి సందేహము వలదండీ
బాధలన్ని తొలగునండి స్వామిదయ చేతనండీ
భయములన్ని తొలగునండి బాధలణగె కదండీ
పాపములు పోవునండి స్వామిదయ చేతనండీ
భవబంధము వీడునండి స్వామిదయ చేతనండీ
సంపదలు కలుగునండి స్వామిదయ చేతనండీ
సంతోషము పెరుగునండి స్వామిదయ చేతనండీ
జయములెన్నొ కలుగునండి చక్కగా నమ్మండీ
స్వామికడ నుందురండి చక్కగా నమ్మండీ
జన్మమింక కలుగదండి చక్కగా నమ్మండీ
రామనామ మొక్కటే రక్షించును నమ్మండీ
నామజపము చాలండీ నమ్మండీ నమ్మండీ