16, డిసెంబర్ 2022, శుక్రవారం

రాముడే లోకముగా రమియించే పురుషుడు

రాముడే లోకముగా రమియించే పురుషుడు
తామసరహితుడై తానిట్టులుండు

ప్రీతి జదువు నిత్యమును శ్రీరాముని చరితమును
చేతులార శ్రీరాముని చెలగి పూజించును

చేయుచుండు ననిశమును శ్రీరాముని గుణగానము
పాయకుండు రామధ్యానపరతను కలనైనను

చింతించును నిత్యమును శ్రీరాముని తత్త్వమును
చింతించును నిత్యమును శ్రీరాముని మహిమనే

చేర్చియుండు ననిశమును శ్రీరాముని భావమున
కూర్చుచుండు శ్రీరాముని కొఱకు సంకీర్తనలు

సేవించును నిత్యమును శ్రీరాముని పాదములు
భావించును శ్రీరాముని పరబ్రహ్మమనుచును

చేరియుండు ననిశమును శ్రీరాముని భక్తులతో
చేరనీడు కామాదివిచిత్రదుష్టశక్తులను


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.