2, డిసెంబర్ 2022, శుక్రవారం

రామ రామ యనుటకు మీకేమి కర్చండీ

రామ రామ యనుటకు మీకేమి కర్చండీ శ్రీ
రాముని ధ్యానించగ మీకేమి కర్చండీ

ఏమి కర్చండీ రాముని యిందునిభానన మెన్న
నేమి కర్చండీ రాముని యింపైన గుణ మెన్న
నేమి కర్చండీ రాముని హెచ్చైన దయ నెన్న
నేమి కర్చండీ రాముని ప్రేమామృతము నెన్న

కర్చేమీ లేదే మీకు కనులార దర్శించగ
కర్చేమీ లేదే మీకు కమలాక్షునకు మ్రొక్క
కర్చేమీ లేదే మీకు గరుడధ్వజుని పొగడ
కర్చేమీ లేదే మీకు కరుణించమని వేడ

దహరాకాశస్థుని జూడ దారికర్చులు లేవు
మహదైశ్వర్యంబు నడుగ మనకు కర్చులేదు
విహగవాహనుని కృపకు వెలయింత యని లేదు
అహహా యింకేమి కర్చని ఆలోచన మీకు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.