22, డిసెంబర్ 2022, గురువారం

రాముని పాదముల వద్ద వ్రాలిన ఓమనసా

రాముని పాదముల వద్ద వ్రాలిన ఓమనసా
రాముని పాదములు వదలి రాకే ఓమనసా

హెచ్చగు నానందము నీ కచ్చటనే మనసా
హెచ్చగు కభయంబును నీ కచ్చటనే మనసా
హెచ్చగు సంపోషణ నీ కచ్చటనే మనసా
మెచ్చదగిన వేమున్నవి నీ కిచ్చట మనసా

అచ్చట ప్రహ్లాదనారదాదు లున్నారే
ముచ్చట హరిభక్తులెల్ల నచట నున్నారే
అచ్చట తొలిరామదాసు హనుమ యున్నాడే
అచ్చటనే నీకు పరమానందము మనసా

పరమాత్ముని సన్నిధియే పరమార్ధము మనసా
నిరుపమానమైన పదము నీకబ్బెను మనసా
హరిసన్నిధి కన్న నేమి యాశింతువు మనసా
మరలివచ్చి సంసారము జొరబడకే మనసా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.