20, డిసెంబర్ 2022, మంగళవారం

ఏమిలాభ మయ్యా రామ యేమిలాభము

ఏమిలాభ మయ్యా రామ యేమిలాభము

ఎంత బంధుబలగమున్న నేమిలాభము - హరి
   చింతన మలవరచు వారు లేకపోయిన
ఎంత చదువు చదువుకొనిన నేమిలాభము- హరి
   చింతనము చేయకుండు జీవితమునకు
ఎంత సంపాదించిన నేమిలాభము - ర
  వ్వంతైనను హరిసేవకు వెచ్చించక
ఎంత మాటకారి యైన నేమిలాభము - రే
  పంతకుడు గద్దించుచు పలుకునప్పుడు
ఎంత గొప్పవంశ మైన నేమిలాభము - అది
   సుంతైనను యముడు గణియింపడే కద
ఎంత మతిమంతుడైన నేమిలాభము - హరి
   చెంత చేరవలయు ననెడు చింతనలేక
ఎంత బ్రతుకు బ్రతికిన నిల నేమిలాభము - భగ
   వంతునిపై భక్తిలేని బ్రతుకు బ్రతికిన
ఎంత దీర్ఘాయువుండి యేమిలాభము - తా
   నెంతకును నిన్ను భజియింప కుండిన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.