2, డిసెంబర్ 2022, శుక్రవారం

దండుమారి బ్రతుకుబ్రతుకక...

దండుగమా‌రి బ్రతుకుబ్రతుకక దశరథరాముని కొలవండి

శ్రీహరిగాథలు చెవులబెట్టని జీవితమెందుకు దండుగ

శ్రీహరిలీలలు మననముచేయని చిత్తమెందుకు దండుగ

శ్రీహరినామము పలుకుచునుండని జిహ్వదేనికి దండుగ

శ్రీహరిరూపము కన్నులజూడని దేహమెందుకు దండుగ

శ్రీహరి సేవకు నోచని తనువున జీవముదేనికి దండుగ

శ్రీహరితత్త్వము చింతనచేయని జీవితమెందుకు దండుగ

శ్రీహరియే శ్రీరఘురాముడని చేరని బ్రతుకు దండుగ

శ్రీహరి భవతారకనామంబును చేయని బ్రతుకు దండుగ