హరినామ మొకటున్నది దానికి
సరి యేదీ లేకున్నది
ఒక్కసారి వినిపించిన ఒడలు ఝల్లుమనిపించే
ఒక్కసారి పలికనంత యుల్లము నుప్పొంగించే
ఒక్కసారి తలచినంత నూహలన్నిట నిండే
ఒక్కసారి మాలిమైన చక్కగా సంరక్షించే
మూడులోకము లేలు ముకుందుని శుభనామము
వేడుకతో లోకేశుల వినతులందు శుభనామము
వాడుకగా యోగీశుల పాలించెడి శుభనామము
వాడవాడలను జనులు భజనచేయు శుభనామము
అవనీశుల సామన్యుల నందరను సరిజూచుచు
పవలురేలు సద్భక్తులు పరవశింప రహించుచు
పవమానసుతప్రముఖ భాగవత సన్నుతమై
భవతారకనామ మనగ వరలు శ్రీరామనామము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.