ఏమేమి నేర్చితివో ఏమేమి చేసితివో
భూమిపై నినుగూర్చి యేమందురో
అని నిలదీయ నొక దినమున సమవర్తి
ధనము తెచ్చెడు విద్యలను నేను నేర్చితి
ధనము లార్జించితిని ధనలోభి వీడను
ఘనమైన పేరు గల దని యందువో
అని నిన్ను నిలదీయ నపుడు సమవర్తితో
వినవయ్య వెన్నుని మనసులో నిలుపుట
యను విద్య నేర్ఛితి నటులే చరించితి
నను రామభక్తు డను లోక మందువో
ఆను ప్రశ్న సమవర్తి యడుగగా నిక్కంబు
గను నీవు వినిపించగల మాట కారాజు
నిను బట్టి నరకాగ్నులను బెట్టి కాల్చునో
ఘనముగా వైకుంఠమున కంపునో తెలియు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.