రామకోవెలకు తోడు రారే చెలులారా
రామయ్యను దరిసించి రావచ్చునే
ఈవంకను లచ్చుమయ్య ఆవంకను సీతమ్మయు
సేవించుచు పాదంబుల చెంతను హనుమ
ఠీవిగాను వారి మధ్య దేవదేవు డుండ గాను
కావలెనే వేయికళ్ళు కనులజూడ
పూలమాలికల నిచ్చి పురుషోత్తము కీర్తించి
చాల భక్తితో తీర్ధప్రసాదములు గొని
మేలైన కీర్తనలను మిక్కిలి శ్రధ్ధగ పాడగ
చాల సంతోష మగును సకియలార
గుడిముందు భక్తజనులు గుమిగూడుచు నున్నారే
వడివడిగా రండు పెండ్లి నడకలు చాలు
గుడితలుపు లవే తెఱచుకొన్నవే చెలులార
తడయనేల మనకిప్పుడు పడతులార
21, డిసెంబర్ 2022, బుధవారం
రామకోవెలకు తోడు రారే చెలులారా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.