వదలరాదు రామనామము విబుధులార మీరు
నిదురనైన నామమును వదలరాదు వదలరాదు
కనులు మూతబడెడు వేళ కమ్మని శ్రీరామనామము
మనసా స్మరియింతురేని మానకను పదేపదే
వినుడు నిదురనైన మనసు విడువకుండు నామమును
జనులారా యింతకన్న సరియైన యుపాయ మేది
మనసులోన రాముడున్న మనుజులకు కలల లోన
మానక హరిస్మృతియు నుండు మానకండి నామమును
మానుగ నీయుపాయమును మరువకుండ పాటించిన
మానవులకు రామునిదయ యేనాడును కొఱత గాదు
పవలు రామనామమును వదలకుండు చేయుచుండి
అవల నిదురనైన గాని యద్దానిని విడువకుండి
భువిని మసలుచున్న మరల పుట్టువు లేకుండపోవు
వివరింపగ నంతకన్న వేడదగిన దేమున్నది
23, డిసెంబర్ 2022, శుక్రవారం
వదలరాదు రామనామము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.